ఎన్నాళ్లీ అవస్థలు..

14 Feb, 2014 02:02 IST|Sakshi
ఎన్నాళ్లీ అవస్థలు..


 పెదకూరపాడు,
 కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండేందుకు ఏజన్సీలు అవస్థలు పడుతున్నారు. కట్టెపుల్లలు కొనుగోలు భారంగా మారింది. కూలి పనులకు వెళ్తే రూ.150 ఇస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చే గౌరవ వేతనం చాలటం లేదని ఏజన్సీలు వాపోతున్నారు. గ్యాస్‌పొయ్యిలు మంజూైరె న కనెక్షన్లు ఇవ్వలేదు. వంట షెడ్లుకు నిధులు మంజూరైన నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇలా మధ్యాహ్నం భోజనం ఏజన్సీలు అవస్థలు పడుతున్నారు. కట్టెల పొయ్యిపై వంటతో కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఏజన్సీలకు 25 మంది విద్యార్థులలోపు రూ.వెయ్యి, 100మంది ఉన్న ఏజన్సీలకు రూ.రెండు వేలు, 100 నుంచి ఆపైన ఉన్న విద్యార్థులకు రూ.మూడు వేలు గౌరవ వే తనం ఇస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు విద్యార్థికి రూ.4.35 పైసలు, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.ఆరు ఇస్తున్నారు. వీటిలోనే కట్టెపుల్లలు, కూరగాయలు కొనుగోలు చేయాలి. ధరలు పెరిగినప్పుడు అనేక అవస్థలు పడుతున్నామని ఏజన్సీలు చెప్తున్నారు. మండలంలో మొత్తం 42 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 42 ఏజన్సీలు ఉన్నారు. వీరిలో 19 మందికి గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేశారు. వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. మండలంలోని 42పాఠశాలలకు గాను 33 పాఠశాలలకు వంట షెడ్లు మంజూరు చేశారు. షెడ్ నిర్మాణానికి రూ.75 వేలు మంజూరు చేశారు. నిధులు చాలవని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రూ.లక్ష వరకు పెంచారని ఉన్నతాధికారులు చెప్తున్నా ఉత్తర్వులు ఎంఈవోకు అందలేదు. మండలంలోని దాతల సహకారంతో గారపాడు జెడ్పీహెచ్, రెండు ప్రాథమిక పాఠశాలలు, కన్నెగండ్ల ప్రాథమిక పాఠశాలల్లో వంటషెడ్లు నిర్మించారు. క్రోసూరు మండలంలో 38 మంది ఏజన్సీలు ఉన్నారు. వారిలో 30మందికి గ్యాస్‌పొయ్యిలు మంజూరు చేశారు. కనెక్షన్లు ఇవ్వలేదు. 30 పాఠశాలలకు వంటషెడ్లుకు నిధులు మంజూరు చేశారు. ఇంకా నిర్మించ లేదు. అచ్చంపేట మండలంలో 62 మంది ఏజన్సీలు ఉన్నారు. సగం మందికి గ్యాస్ కనెక్షన్లు మంజురూ చేసిన కనెక్షన్లు ఇవ్వలేదు. వంట షెడ్లు కోసం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అమరావతి మండలంలో 56 మంది ఏజన్సీలు ఉన్నారు. వీరి అవస్థలు అన్ని ఇన్ని కావు. కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. బెల్లంకొండ మండలంలోని 35 ఏజన్సీలకు ఇదే పరిస్థితి.
 
 

మరిన్ని వార్తలు