సామాజిక ఇంజనీర్లుగా ఖ్యాతి గడించాలి

14 Feb, 2015 02:29 IST|Sakshi

అనంతపురం యూనివర్సిటీ :  ఇంజనీరింగ్ విద్య అభ్యసించడంతో పాటు సమాజ హితం కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక ఇంజనీర్లుగా ఖ్యాతి గడించాలని జేఎన్‌టీయూ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక రాష్ట్ర యువజనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం ద్వారా సేవ చేసే అవకాశం విద్యార్థి దశలో దక్కడం అపురూపంగా భావించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. యువజనోత్సవాలలో పాల్గొనడం ముఖ్యమని, గెలుపు ఓటములను పక్కన పెడితే అందులోని నైపుణ్యాలను గుర్తించుకోవాలని సూచించారు.
 
  ఘనంగా యువజనోత్సవాలను నిర్వహించిన ఘనత వర్సిటీలో పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకే దక్కుతుందని కితాబిచ్చారు. సాధనతోనే అద్భుత విజయాలు దోహదపడతాయని ఉద్బోధించారు. అద్భుతమైన ప్రదర్శనల ఒరవడిని కొనసాగించి జాతీయ స్థాయి యువజనోత్సవాలలో విజయం సాధించాలని అకాంక్షించారు. ఆ ఉత్సవాలనూ జేఎన్‌టీయూలోనే ఏర్పాటు చేసే అవకాశం రావాలని అకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. యువజనోత్సవాలను నిర్వహించడానికి నిర్విరామంగా కృషి చేసిన డాక్టర్ నారాయణ రెడ్డి, అరుణ కాంతి, రామశేఖర్‌రెడ్డిలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు. రెక్టార్ ఆచార్య హెచ్.సుదర్శనరావు మాట్లాడుతూ
 
 సామాజిక ఇంజనీర్లుగా
 ఖ్యాతి గడించాలి
 
 ప్రతిష్టాత్మక యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఉత్తమ జీవన విలువలు నేర్చుకోవడానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయన్నారు. గతంలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు అంటే కేవలం పచ్చదనం పరిశుభ్రత అని భావించే వాళ్లని, జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు.
 
 
 రక్తదాన శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకు రావడం వంటి కార్యక్రమాలను జేఎన్‌టీయూ పరిధిలో 100కు పైగా ఎన్‌ఎస్‌ఎస్ కేంద్రాలు చేస్తున్నాయని వివరించారు. ఈ ఘనత వీసీ లాల్‌కిశోర్‌కే దక్కుతుందన్నారు. సేవ చేయడమే మానవ ప్రధాన కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. జేఎన్‌టీయూలో మూడు వేలకు పైగా చెట్లను పెంచి  నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వయోజన విద్య , యోగ లాంటి కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ విభాగం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్  కోఆర్డినేటర్ ఎన్‌ఏడీ పాల్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడం ముఖ్యమన్నారు. ‘నాట్ మీ.. బట్ యు’ అనే నినాదంతో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ముందుకు వెళ్లాలన్నారు. విజయానికి అడ్డదారులు లేవన్నారు. జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్ మాట్లాడుతూ.. 240 మంది ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. విభజన తర్వాత తొలి రాష్ట్ర యువజనోత్సవాలను నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఈశ్వర్‌రెడ్డి, ఆచార్య దుర్గాప్రసాద్, డాక్టర్ చంద్రమోహన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ఆంధ్రా యూనివర్సిటీ అదుర్స్
 రాష్ట్ర యువజనోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన పోటీలలో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు గాను ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాయలసీమ యూనివర్సిటీకి ద్వితీయ స్థానం దక్కింది.
 
 ఎస్కేయూకు పతకాల పంట
 శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యుత్తమంగా రాణించారు. లంబాడీ డ్యాన్స్ చేసిన షహీన్ ృందానికి మెదటి స్థానం దక్కింది. ఫోస్టర్ పేయింటింగ్‌లో ద్వితీయ స్థానం, ఫోటో ఎగ్జిబిషన్, క్లాసిక్ డ్యాన్స్, క్విజ్‌లో మూడో స్థానాలు సాధించుకొంది. కాగా, కార్యక్రమాలకు ఆతిథ్యం యిచ్చిన జేఎన్‌టీయూ అనంతపురం.. గ్రూప్ డ్యాన్స్‌లో మూడో స్థానం సాధించుకుని ఒకే ఒక పతకంతో సరిపెట్టుకుంది.
 
 
 అనంతపురం యూనివర్సిటీ : ఇంజనీరింగ్ విద్య అభ్యసించడంతో పాటు సమాజ హితం కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక ఇంజనీర్లుగా ఖ్యాతి గడించాలని జేఎన్‌టీయూ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక రాష్ట్ర యువజనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం ద్వారా సేవ చేసే అవకాశం విద్యార్థి దశలో దక్కడం అపురూపంగా భావించాలన్నారు.
 
 గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. యువజనోత్సవాలలో పాల్గొనడం ముఖ్యమని, గెలుపు ఓటములను పక్కన పెడితే అందులోని నైపుణ్యాలను గుర్తించుకోవాలని సూచించారు. ఘనంగా యువజనోత్సవాలను నిర్వహించిన ఘనత వర్సిటీలో పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకే దక్కుతుందని కితాబిచ్చారు. సాధనతోనే అద్భుత విజయాలు దోహదపడతాయని ఉద్బోధించారు. అద్భుతమైన ప్రదర్శనల ఒరవడిని కొనసాగించి జాతీయ స్థాయి యువజనోత్సవాలలో విజయం సాధించాలని అకాంక్షించారు. ఆ ఉత్సవాలనూ జేఎన్‌టీయూలోనే ఏర్పాటు చేసే అవకాశం రావాలని అకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. యువజనోత్సవాలను నిర్వహించడానికి నిర్విరామంగా కృషి చేసిన డాక్టర్ నారాయణ రెడ్డి, అరుణ కాంతి, రామశేఖర్‌రెడ్డిలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు. రెక్టార్ ఆచార్య హెచ్.
 
 సుదర్శనరావు మాట్లాడుతూ
 ప్రతిష్టాత్మక యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఉత్తమ జీవన విలువలు నేర్చుకోవడానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయన్నారు. గతంలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు అంటే కేవలం పచ్చదనం పరిశుభ్రత అని భావించే వాళ్లని, జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు.
 
  రక్తదాన శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకు రావడం వంటి కార్యక్రమాలను జేఎన్‌టీయూ పరిధిలో 100కు పైగా ఎన్‌ఎస్‌ఎస్ కేంద్రాలు చేస్తున్నాయని వివరించారు. ఈ ఘనత వీసీ లాల్‌కిశోర్‌కే దక్కుతుందన్నారు. సేవ చేయడమే మానవ ప్రధాన కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. జేఎన్‌టీయూలో మూడు వేలకు పైగా చెట్లను పెంచి  నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వయోజన విద్య , యోగ లాంటి కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ విభాగం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్  కోఆర్డినేటర్ ఎన్‌ఏడీ పాల్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడం ముఖ్యమన్నారు.
 
  ‘నాట్ మీ.. బట్ యు’ అనే నినాదంతో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ముందుకు వెళ్లాలన్నారు. విజయానికి అడ్డదారులు లేవన్నారు. జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్ మాట్లాడుతూ.. 240 మంది ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. విభజన తర్వాత తొలి రాష్ట్ర యువజనోత్సవాలను నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఈశ్వర్‌రెడ్డి, ఆచార్య దుర్గాప్రసాద్, డాక్టర్ చంద్రమోహన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ఆంధ్రా యూనివర్సిటీ అదుర్స్
 రాష్ట్ర యువజనోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన పోటీలలో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు గాను ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాయలసీమ యూనివర్సిటీకి ద్వితీయ స్థానం దక్కింది.
 
 ఎస్కేయూకు పతకాల పంట
 శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యుత్తమంగా రాణించారు. లంబాడీ డ్యాన్స్ చేసిన షహీన్ ృందానికి మెదటి స్థానం దక్కింది. ఫోస్టర్ పేయింటింగ్‌లో ద్వితీయ స్థానం, ఫోటో ఎగ్జిబిషన్, క్లాసిక్ డ్యాన్స్, క్విజ్‌లో మూడో స్థానాలు సాధించుకొంది. కాగా, కార్యక్రమాలకు ఆతిథ్యం యిచ్చిన జేఎన్‌టీయూ అనంతపురం.. గ్రూప్ డ్యాన్స్‌లో మూడో స్థానం సాధించుకుని ఒకే ఒక పతకంతో సరిపెట్టుకుంది.
 

మరిన్ని వార్తలు