సాఫ్ట్‌వేర్‌ రైతన్న

17 Jun, 2020 11:28 IST|Sakshi
నగేష్‌ సాగుచేసిన పశుగ్రాసం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నగేష్‌

లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయం

స్వగ్రామంలో సాగుపై ఆనందం

సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ వదులుకోలేదు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలపాటు స్వగ్రామంలో ఉండే అవకాశం దొరకడంతో తన కోరికను తీర్చుకునే పనిలో పడ్డాడు. ముఖ్యంగా పాడి పరిశ్రమపై దృష్టిసారించి ఆశయం నెరవేర్చుకున్నాడు. 

కుప్పం: రామకుప్పం మండలం బందార్లపల్లెకు చెందిన గోవిందప్పకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్దవాడైన బీజీ నగేష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నెలకు రూ.2లక్షల వేత నం అందుకుంటున్నాడు. ఆయన భార్య, తమ్ముడు రమేష్, మరదలు కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. అయితే తండ్రి గోవిందప్ప మా త్రం స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో వీరందరూ బందార్లపల్లెకు చేరుకున్నారు. దాదాపు మూడు నెలలుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. దీంతో నగేష్‌ తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ. ఈ క్రమంలో ఓ షెడ్డు నిర్మించుకున్నాడు. 20 పాడి ఆవులను కొనుగోలు చేశాడు. రెండెకరాలలో పశుగ్రాసం సాగు చేపట్టాడు. తానే దగ్గరుండి పాడి ఆవుల సంరక్షణ చూసుకుంటూ తండ్రికి చేదోడువాదోడుగా నిలిచాడు. వృత్తిపరంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయినా ప్రవృత్తి పరంగా తనలోని రైతును సంతృప్తి పరిచాడు. స్వగ్రామంలో వ్యవసాయం చేయడం తనను ఎంతో ఆనందపరిచిందని వెల్లడిస్తున్నాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా