సూర్యగ్రహణం: అటు సందడి.. ఇటు చైతన్యం

26 Dec, 2019 12:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ/తిరుపతి: సూర్య గ్రహణం సందర్బంగా తిరుపతి సైన్స్ సెంటర్‌లో విద్యార్థులు సందడి చేశారు. ఉదయం నుంచి గ్రహణం ముగిసేవరకు అక్కడే ఉండి ప్రత్యేక గ్లాసెస్ ద్వారా ఈ అంతరిక్ష అబ్బురాన్ని వీక్షించారు. చాలా అరుదుగా వచ్చే సూర్యగ్రహణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. సైంటిస్టులు మాత్రం గ్రహణం సందర్బంగా సూర్యుడిని డైరెక్ట్ గా చూడకూడదని, ప్రత్యేక గ్లాసుల ద్వారా చూడటం వల్ల కళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

సూర్యగ్రహణం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల్లో చైతన్యం నిపేందుకు గురువారం విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రహణాల విషయంలో ఉన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించి.. ఈ విషయంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసింది. సోలార్ ఫిల్టర్ క్లిప్స్‌తో గ్రహణం వీక్షణ చేపట్టింది. సోలార్‌ పరికరాలతో గ్రహణాన్ని చూడండి.. మూఢనమ్మకాలు వీడండి అంటూ ఈ సందర్భంగా నినాదాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు