వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్యకు ఘన నివాళి

15 Jun, 2014 02:06 IST|Sakshi
వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్యకు ఘన నివాళి

 పీసీపల్లి (పెదఅలవలపాడు) : మండలంలోని పెదఅలవలపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త బోగాడ సింగయ్యపై టీడీ పీ కార్యకర్తలు పాశవికంగా దాడి చేసి కర్రలతో కొట్టి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. కాగా శుక్రవారం రాత్రి సింగయ్య మృతదేహాన్ని పెదఅలవలపాడుకు తీసుకొచ్చారు. కొట్టొద్దని బతిమలాడినా తన భర్తను చనిపోయే దాకా కొట్టారని సింగయ్య భార్య వైఎస్సార్ సీపీ నేత బుర్రా మధుసూధన్ యాదవ్ వద్ద కన్నీటి పర్యంతమైంది.
 
తన తండ్రిని టీడీపీ వాళ్లు అన్యాయంగా కొట్టి చంపారని తమకు న్యాయం చేయాలంటూ సింగయ్య కుమారుడు సురేష్ బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. సింగయ్య భౌతికకాయానికి బుర్రా మధుసూదన్‌తో పాటు బొర్రా మాల్యాద్రి చౌదరి, కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, పామూరు కన్వీసర్ అంబటి కొండారెడ్డి, రామిరెడ్డి, వైఎం ప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు.
 
కుటుంబానికి అండగా ఉంటా
టీడీపీ నేతల దాష్టికానికి బలైన సింగయ్య కుటుంబానికి తాను అండగా ఉంటానని బుర్రా మధుసూధన్ హామీ ఇచ్చారు. సింగయ్య మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని వార్తలు