లాక్‌డౌన్‌లో బయట ఆటలు ఆడుతున్న ఆకతాయిలు

3 Apr, 2020 15:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా మహమ్మారి విజృంభించడంతో అది మరింత వ్యాపించకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం అత్యవసరమైన విషయమని ప్రధాని మోదీతో సహా సెలబ్రెటీలు, మీడియా, టీవీ ఛానళ్లు, డాక్టర్లు అందరూ పదే పదే చెప్తున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లు దాటి బయటకు రాకుండా ఎక్కడిక్కడ పోలీసులు మోహరించి గట్టి చర్యలు తీసుకుంటున్నా... కొంతమంది మాత్రం భాద్యతరహితంగా రోడ్డపైనా, రైల్వేట్రాక్‌లపైనా క్రికెట్‌, కర్రబిల్ల వంటి ఆటలు ఆడుతున్నారు. స్థానిక విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో రోజు 50 మంది వరకు మాస్క్‌లు పెట్టుకోకుండా బయటకు వచ్చి ఆటలు ఆడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతుండటానికి తోడు ఇలాంటి చర్యల వల్ల కరోనా మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు