పోలీసు అధికారుల పక్కచూపులు!

22 Apr, 2019 04:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలీసుశాఖలో పలువురు అధికారుల పక్కచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు కేంద్ర సర్వీసులవైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో పాటు పలువురు ఐపీఎస్‌లు సైతం క్యూ కడతారంటూ ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పలువురు పోలీసు అధికారులు చంద్రబాబుకు వీరవిధేయులుగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే.

ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీ నాటికి పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విషయమై పోలీసుశాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి అఖిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్, ఐఏఎస్‌ వంటి కీలక అధికారులు రాష్ట్రంలో పలు రాజకీయ వివాదాల్లో కూరుకుపోయారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారనే విమర్శలను మూటగట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలోని కొందరు పోలీసు అధికారులు మరీ బాహాటంగానే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుత డీజీపీ ఠాకూర్‌ గతంలో ఏ డీజీపీ కూడా ఎదుర్కోనన్ని ఆరోపణలను అతి తక్కువ సమయంలోనే మూటగట్టుకున్నారు.  

సదా చంద్రబాబు సేవలో.. 
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు అయితే అసలు విధులు వదిలి చంద్రబాబు కోసం రాజకీయ సర్వేలు, పార్టీ ఫిరాయింపులు వంటి అనేక కార్యకలాపాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ మాజీ బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు యోగానంద్, మాధవరావులతో పాటు పలు జిల్లాల ఎస్పీలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ చిత్రం మారనుందనే విషయం తెలుసుకున్న  వారిలో ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోదామన్న ఆలోచనలతో పలువురు ఐపీఎస్‌లు పావులు కదుపుతున్నట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్‌

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

దారుణం : తల, మొండెం వేరు చేసి..

సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి బంపర్‌ మెజారిటీ!

రీపోలింగ్‌కు కారణం ఎవరు?

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి..

ఉపాధి పేరుతో స్వాహా!

జగన్‌ సీఎం కాకుంటే రాజకీయ సన్యాసం 

దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

రీపోలింగ్‌పై టీడీపీకి భయమెందుకు?

లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..

భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాలి

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

చంద్రగిరి రీపోలింగ్‌: దొంగ ఓటు వేయటానికి వ్యక్తి యత్నం

కరువు తీవ్రం బతుకు భారం

కౌంటింగ్‌ నుంచి ఆ వీవీప్యాట్‌లను తొలగిస్తాం

లగడపాటి చిలుక పలుకులు..

మరో 96 గంటలే..

పడకేసిన ఫైబర్‌ నెట్‌ 

ప్రజలు ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు

పోలింగ్‌ అధికారిని  ప్రద్యుమ్న బెదిరించారు

చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు

నేడైనా ఓటేయనిస్తారా?

చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే

‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

కనకదుర్గమ్మ గుడిలో ‘మహర్షి’ టీమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..