త్వరలో ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వేంకటేశ్వర’ పుస్తకావిష్కరణ

2 Jul, 2018 04:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తాను రచించిన ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వేంకటేశ్వర’పుస్తకాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో ఈ పుస్తకం వెలువడుతుందని ఆదివారం ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి మహత్మ్యం, స్వామి ఆలయ విశిష్టత, ఆచారాలు, సంప్రదాయాలపై ఈ పుస్తకం రచించినట్లు తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ ఏడాది మనకు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధించాలంటే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి. మనం శాయశక్తులా కృషి చేసి ఈ కలను సాకారం చేసుకుందాం’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు