త్వరలో మరో మహిళా డిగ్రీ కళాశాల

21 Jan, 2014 01:34 IST|Sakshi
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మహిళా విద్యను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు కాకినాడలో మాత్రమే మహిళా డిగ్రీ కళాశాల ఉంది. రెండో కళాశాలను అమలాపురంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నెలకొల్పనున్నారు. అమలాపురంలో ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ఉంది. ప్రభుత్వం నియమించిన కమిటీ అమలాపురంలో సోమవారం పర్యటించి అధ్యయనం చేసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కమిటీ సందర్శించింది. కోనసీమలో ఉన్న 29 ప్రైవేటు జూని యర్ కళాశాలలో దాదాపు 6,600 మంది బాలికలు చదువుతున్నట్టు కమిటీ గుర్తించింది.
 
 రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, అధ్యాపకుడు కె.శ్రీనివాసరావుతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది. అమలాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ రాజబాబు బృందానికి వివరాలు అందజేశారు. డిగ్రీ కళాశాలకు 24 మంది అధ్యాపకు లు, 12 మంది అధ్యాపకేతర సిబ్బంది అవసరమని కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో పేర్కొం ది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుతం అమలాపురంలో ఉన్న ప్రభు త్వ జూనియర్ బాలికల కళాశాలలోనే మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిటీ ప్రతినిధి చప్పిడి కృష్ణ సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో తరగతికి 60 మంది విద్యార్థుల చొప్పున కళాశాల ప్రారంభం కానుం ది. జిల్లా మంత్రి తోట నరసింహం అమలాపురంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చా రు. సీఎం ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించడంతో కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
 
మరిన్ని వార్తలు