సారీ.. పనులు చేయలేం!

1 Oct, 2014 04:01 IST|Sakshi
సారీ.. పనులు చేయలేం!

గద్వాల: సిమెంట్, ఇనుము తదితర వాటి ధరలు పెరిగిన దృష్ట్యా రేట్లు పెంచాలని నెట్టెం పాడు ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లు మొం డికేశారు. నిధులేమి పేరుతో ముఖ్యమైన పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలు మినహా మిగతా పది ప్యాకేజీల్లో పనులు పూర్తిగా స్తం భించిపోయాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం 109 వరకు ఉన్నాయి. ఇం దులో 104, 107 మినహా మిగతాప్యాకేజీల్లో పనులు నామమాత్రంగా కొనసాగుతున్నా యి. ఇదే పరిస్థితి కొనసాగితే ముందే ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జులైలోనూ నెట్టెంపాడు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సా గునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. మ హబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల ను చేపట్టడంలో భాగంగా జలయజ్ఞం ద్వారా గ ద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అప్పటి ప్రభుత్వం మంజూరుఇచ్చింది.

 2009 వరకు పనులు వేగవంతంగా కొనసాగాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు పనులు నత్తను తలపించాయి. 2012 నుంచి పనులు కాస్త వేగవంతమైనా కొత్తరేట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు. ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో పనులవేగం మరింత తగ్గింది. ఇలా కారణం ఏదైనా కేవలం ఐదేళ్లలో పూర్తికావాల్సిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు. 80శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పాత ధరలపై 15 నుంచి 25శాతం పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే సుమారు రూ.100కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

 ముఖ్యమైన పనులు పెండింగ్
 నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్లలోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం మొత్తం 14 ప్యాకేజీలుగా పనులు విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇందులో కాల్వలు, రిజర్వాయర్ల పనులను ప్యాకేజీ 99 నుంచి 109 వరకు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చారు.
 పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని విడిగా రెండు కాంట్రాక్టు సంస్థలకు 13,14 ప్యాకేజీలుగా అప్పగించారు. ఇలా మొత్తం 14 ప్యాకేజీల్లో నెట్టెంపాడు పనులను చేపట్టే విధంగా రూపొందించారు. పంప్‌హౌస్‌ల పనులు దాదాపు పూర్తయ్యాయి. రిజర్వాయర్లు, ప్రధానకాల్వల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు మట్టి పనులను పూర్తిచేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి కీలకమైన సిమెంట్ నిర్మాణ పనులు, రిజర్వాయర్ల వద్ద గేట్ల నిర్మాణాలు, డిస్ట్రిబ్యూటరీల మళ్లింపు గేట్లు, ప్రధానకాల్వల నుంచి నీటి మళ్లింపు పనులు చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు ఫీడర్ చానల్స్, పొలాలకు నీటిమళ్లింపు గేట్లు, పిల్లకాల్వల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పంపుహౌస్‌లు, రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసే ప్రధానకాల్వలను మాత్రమే పూర్తిచేసి, చెరువులకు నీళ్లు వదులుతున్నారు. ఇలా ముఖ్యమైన సిమెంట్ నిర్మాణపనులు అసంపూర్తిగా ఉండడంతో సాగునీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. జూలై 2015 నాటికి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా పనులు సిద్ధంచేయాలని హైద రాబాద్‌లో నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు సమావేశాలు తరచూ నిర్వహిస్తున్నారు.




 

మరిన్ని వార్తలు