శబరిమలైకు ప్రత్యేక రైళ్లు

22 Nov, 2013 04:15 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్:శబరిమలై భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్‌ల నుంచి కొల్లాం వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25 నుంచి ఉదయం 8 గంటలకు శబరిమలై ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది. కాకినాడ-కొల్లాం (07211/07212) మధ్య 38 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు డిసెంబర్ 12, 13, 15, 16, 18, 19, 21, 22 జనవరి 1 ,2 ,4 ,5, 7, 8, 10 ,11 ,13, 14, 15 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14, 15, 17, 18, 20, 21, 23, 24 జనవరి 3, 4, 6, 7, 9, 10, 12, 13, 15, 16, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుకుంటాయి. 
 
 సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో ఆగుతాయి. నర్సాపూర్-కొల్లాం (07217/07218) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటాయి. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరంటౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, తరిగొప్పుల, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో  ఆగుతాయి.
 
  విజయవాడ-కొల్లాం (07219/07220) మధ్య 4 సర్వీసులు నడుస్తాయి. జనవరి 3,9 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 5, 11 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
  విజయవాడ-కొల్లాం (07213/07214) మధ్య గుంటూరు, తిరుపతి మీదుగా 6 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 7, 11, 18 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9, 13, 20 తేదీల్లో ఉదయం 5.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. 
మరిన్ని వార్తలు