ప్రైవేట్ బోట్లును అనుమతించకండి: ఎస్పీ

21 Jan, 2020 18:30 IST|Sakshi

సాక్షి,  కృష్ణా : మంగళవారం జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌ బాబు మెరైన్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెరైన్ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు.  ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. మెరైన్ బోట్లను నిత్యం గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలు, మెరైన్  సిబ్బందితో కలిసి తీర ప్రాంత గ్రామాలలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  గిలకలదిండి, ఓర్లగొందితిప్ప, పాలకాయ తిప్పి పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ పరిస్థితులు సమీక్షిస్తామని అన్నారు. 

మత్స్యకారుల సంరక్షణ కోసం నిరంతర కార్యాచరణ రూపొందిస్తున్నామని,  తీర ప్రాంత సంరక్షణ కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, వేట వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్‌లో సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేసి, మెరైన్  ఉనికి  చాటేలా కార్యాచరణ చేపడతామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ బోట్లు కాకుండా, ప్రైవేట్ బోట్లు అనుమతించ వద్దని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సత్తిబాబు, కృష్ణ కాంత్ పటేల్ ,  డీఎస్పీ ధర్మేంద్ర, మెరైన్ ఎసై, సిఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు