అమ్మ ఎవరికైనా అమ్మే..!

31 Mar, 2020 07:34 IST|Sakshi
కూరగాయలు అమ్ముతున్న వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎస్పీ రమేష్‌రెడ్డి

వృద్ధురాలి నుంచి కూరగాయాలు కొని ఉచితంగా పంపిణీ 

సాక్షి, తిరుపతి: ఆవిడో 65 ఏళ్ల పైచిలుకు వృద్ధురాలు..చుర్రుమంటున్న ఎండలో కూరగాయలు అమ్మడానికి ఇబ్బందులు పడుతుండటం అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి గమనించారు. ఎండలో నీకెందుకమ్మా!? ఇంతకష్టం? అని ఆమెను పలకరించారు. ఇంతవరకూ అమ్ముడుపోవడం లేదు నాయనా..అని ఆమె దిగాలుగా బదులిచ్చింది. సరేనమ్మా! నువ్వేమీ దిగులుపడొద్దు. అమ్మలాంటి దానివి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వీ పనులు చేయొద్దు అంటూ ఆమె వద్ద ఉన్న కేరట్, వంకాయలు, పచ్చిమిర్చి మొత్తం ఆయనే కొన్నారు.

అంతే ఆమె మోములో ఆనందం తొంగిచూసింది. అలాగే,  ఆమె పక్కనే ఇదే పరిస్థితిలో ఉన్న మరో వృద్ధుడి నుంచి మూడు మూటల నిమ్మకాయలు సైతం కొనుగోలు చేశారు. తాను కొన్న వాటన్నింటీనీ అక్కడే ప్రజలు, పాత్రికేయులు, పోలీసులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆరోగ్యం కాపాడుకో తల్లీ! అంటూ జాగ్రత్తలు చెప్పి పంపారు. సోమవారం స్థానిక నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌లోని తాత్కాలిక కూరగాయాల మార్కెట్‌లో చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు