నేర నియంత్రణకు నిరంతర నిఘా

24 Nov, 2018 08:11 IST|Sakshi
కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసులకు ప్రశంసాపత్రం అందజేస్తోన్న ఎస్పీ ఎం.రవిప్రకాష్, చిత్రంలో అదనపు ఎస్పీ కే.ఈశ్వరరావు

ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలి

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

సమీక్షా సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్‌

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : పశ్చిమలో నేరాలను నియంత్రించేందుకు పోలీసు వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ చెప్పారు. ఏలూరు పోలీసు ప్రధాన కేంద్ర కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చోటుచేసుకున్న గ్రేవ్, నాన్‌గ్రేవ్‌ కేసులను సర్కిల్‌ వారీగా ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇటీవల పెరిగిన ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల పరిష్కారానికి ఏలూరు, నరసాపురం డివిజన్‌లలో ప్రత్యేక పార్ట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాటలు నిర్వహించకుండా హైకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, గోవుల అక్రమ రవాణా, పేకాట, క్రికెట్‌ బెట్టింగులపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కే.ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ ప్రభాకరబాబు, పోలవరం డీఎస్పీ రవికుమార్, మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ పైడేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీలు నున్న మురళీకృష్ట, ఏ.శ్రీనివాసరావు, సీసీఎస్‌ డీఎస్పీ టీ.సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ ఎస్‌.కొండలరావు, డీసీఆర్‌బీ సీఐ జీవీ కృష్ణారావు, డీసీఆర్‌బీ ఎస్‌ఐలు రిజ్వాన్, రామకృష్ణ, పోలీసు న్యాయ సలహాదారు కే.గోపాలకృష్ణ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

ప్రతిభావంతులకు పురస్కారాలు  
జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తోన్న పోలీసు సిబ్బంది తమ విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన పోలీసులకు నగదు పురస్కారం తోపాటు, ప్రశంసాపత్రాలను ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అందజేశారు. పోలవరం సబ్‌డివిజన్‌ పరి ధిలో కుక్కునూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎటువంటి ఆధారాలులేకి కేసును ఛేదించి ముగ్గురు ముద్దాయిలను ఆరెస్టు చేసిన సీఐ డీ.భగవాన్‌ ప్రసాద్, ఎస్సై మధు వెంకటరాజు, వేలేరుపాడు ఏఎస్సై వై.శ్రీని వాసరావు, హెచ్‌సీ జీ.అక్రమ్, పీవీఎస్‌ ప్రవీణ్‌కుమార్, పీసీ జీ.శేఖర్, ఎం.శ్రీనివాస్, పీ.రాజేష్, కే. ప్రసాద్‌బాబు, బీ.సత్యనారా యణ పురస్కారం అందుకున్నారు. జంగారెడ్డిగూడెం ఎస్‌బీ హెచ్‌సీ ఎన్‌.నాగేశ్వరరావు సమాచారం మేరకు దాడులు నిర్వహించి కొయ్యలగూడెంలోని ఓ ఇంటిలో రూ.1.50లక్షల విలువైన గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ కే.బాలరాజు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, హెచ్‌సీ డీవీ రమణ, పీసీ సీహెచ్‌ఎంవీ గణేష్‌ పురస్కారం అందుకున్నారు.

మరిన్ని వార్తలు