నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..!

19 Nov, 2019 09:58 IST|Sakshi
తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు అర్జీ అందజేస్తున్న గౌతమి 

ప్రమాదంలో గాయపడి, చెన్నైలో చికిత్స పొందుతున్నాడు!  

ఆరోగ్యశ్రీ కార్డు లేక ఆర్థిక ఇబ్బందులు 

స్పందనలో తహసీల్దార్‌ ను వేడుకున్న చెర్లోపల్లె వాసి గౌతమి 

సాక్షి, తిరుపతి: ‘కుటుంబానికి ఆయనే పె ద్ద దిక్కు. శుభ కార్యానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలలో రక్తం గడ్డకట్టిపోవటంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తిరుపతిలో కష్టం అని చెప్పారు. దీంతో ప్రాణపాయ స్థితి లో చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి కే ఆస్తులు అమ్మి శక్తికి మించి వైద్యం చేయించాం. ఇంకా రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంటా. రేషన్‌కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి.’ సారూ... అంటూ తిరుపతి రూరల్‌ మండ లం చెర్లోపల్లె పంచాయతీ వెంకటపతినగర్‌ కు చెందిన రమేష్‌ భార్య గౌతమి కన్నీరుమున్నీరు అయ్యింది. ఆ మేరకు సోమవారం రూ రల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్‌ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ సుశీలాదేవికి వినతిపత్రం అందించింది.

సాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ రమేష్‌ ఎస్వీ యూనివర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 14వ తేదీన పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రామాపురం వద్ద ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయాడని, దీంతో తలకు గాయమైందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రమే‹Ùకు తిరుపతి లో  వైద్యం కష్టం అని చెప్పడంతో చెన్నై అపో లో ఆస్పత్రి ఐసీయూలో చేర్పించి, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.7 లక్షలకు పైగా ఖర్చు అయిందన్నారు. మరో రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతా యని వైద్యులు చెప్పారన్నారు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవా లని వేడుకున్నారు. తమకు రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నారు.  స్పందించిన తహసీల్దార్‌ కి రణ్‌కుమార్‌ వెంటనే ఆరోగ్యశ్రీకి వీరు అర్హులే అని సరి్టఫికెట్‌  అందించారు. ఇంకా అవస రం అయితే సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు.

మరిన్ని వార్తలు