‘అత్యాచారాల నిరోధానికి సెల్‌లు’

8 May, 2018 02:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక్‌ సెల్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపా రు. ఇలాంటి సంఘట నల్లో ఏంచేయాలనే దానిపై అధ్యయనం చేయిస్తామని, అవసరమైతే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం పేరుతో సోమవారం విజయ వాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకూ జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనం తరం స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడారు. కార్యక్రమంలో చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి తదితరులు పాల్గొన్నారు.

అది మా విధానం కాదు
జనాభా నియంత్రణ తమ విధానం కాదని చంద్రబాబు అన్నారు. జనాభాను నియంత్రిస్తే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్‌ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారమిక్కడ సచివాలయంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయించడం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్థికంగా పురోగతిలో ఉన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.

కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు చేటు చేసే విధంగా ఉందన్నారు. కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో రాష్ట్రాలకున్న అభ్యంతరాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆర్థిక మంత్రుల సమావేశంలో డ్రాఫ్ట్‌ మెమోరాండం రూపొందించారు. వాటిని సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు అందజేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాటిని చూపించి మార్పులేమైనా ఉంటే.. సరిచేసి ఢిల్లీలో మూడో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ తీసుకుని మెమోరాండం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు