విజయవాడ సూపర్బ్

30 Jan, 2015 00:47 IST|Sakshi
విజయవాడ సూపర్బ్

CHITCHAT
 
‘సాక్షి’తో యువహీరో వరుణ్ సందేశ్

 
‘హ్యాపీడేస్’ సినిమాతో తన హ్యాపీడేస్‌ను    మొదలుపెట్టి.. ‘కొత్తబంగారులోకం’తో తన  సినీ జీవితాన్ని బంగారుమయం చేసుకుని..   ‘కుర్రాడు’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హీరో   వరుణ్ సందేశ్ తాజాగా ‘పడ్డానండి ప్రేమలో మరి..’ అంటూ ప్రేమికుల రోజున మన ముందుకు రాబోతున్నాడు. కేబీఎన్ కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన నగరానికి వచ్చారు. విజయవాడ           సూపర్బ్.. అంటూ నగర వాతావరణాన్ని,   నగరవాసులను మెచ్చుకున్న యువహీరో వరుణ్ సందేశ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్.           - వన్‌టౌన్
 
 సాక్షి : న్యూజెర్సీ నుంచి తెలుగ చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు?

వరుణ్ : మేము తెలుగువాళ్లమే అరుునా న్యూజెర్సీలో స్థిరపడ్డాం. మా తాతగారు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ సాహితీవేత్త. మా బాబాయ్ జీడిగుంట శ్రీధర్ నటుడు. ఈ క్రమంలోనే నాకు నటనపై ఆసక్తి కలిగింది. ‘హ్యాపీడేస్’ చిత్రం కోసం శేఖర్‌కమ్ముల కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తుండగా, నేనూ ప్రయత్నించి విజయం సాధించా.

సాక్షి : మీకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు..?

వరుణ్ : హ్యాపీడేస్, కొత్తబంగారులోకం నాకు మంచి బ్రేక్‌నిచ్చారుు. మరికొన్ని సినిమాలు    నటుడిగా నిలదొక్కుకోవడానికి సహాయపడ్డాయి. ఏదిఏమైనా జీవితం హ్యాపీగానే నడుస్తోంది.
 
సాక్షి : ఇటీవల ఒకటి రెండు చిత్రాలు మీకు నిరాశ మిగిల్చినట్లున్నారుు..?

వరుణ్ : అవును. కారణాలు ఏమైనా ఒకటి రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంత నిరాశ కలిగిన మాట వాస్తవమే.
 
సాక్షి : కారణాలు ఏమని భావిస్తున్నారు.
 
వరుణ్ : కారణాలు చాలానే ఉన్నారుు. ఏ సినిమా అరుునా ప్రేక్షకులకు నచ్చాలనే కదా తీసేది. అరుుతే, అందులోని కొన్ని అంశాలే నిరాదరణకు గురవుతున్నారుు. ఇకపై అలాంటి తప్పులు            చేయకుండా జాగ్రత్త పడతా.
 
సాక్షి : మీ కొత్త సినిమాలేమిటి?

వరుణ్ : రామచంద్రప్రసాద్ మహేష్ దర్శకత్వంలో నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీని కూడా విజయవాడలోనే నిర్ణయించుకున్నాం. మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాం.

సాక్షి : ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్ర కథాంశం ఏమిటి?

వరుణ్ : లవ్‌స్టోరీనే అరుునా యూక్షన్‌తో సాగుతుంది. కుటుంబమంతా కలిసి చక్కగా చూడొచ్చు. ప్రతి మనిషీ ‘మానవత్వం’ కలిగి ఉండాలనే           సందేశాన్ని ఇందులో చెప్పాం.

సాక్షి : మీ కొత్త ప్రాజెక్టులు..

వరుణ్ : ‘లవకుశ్’, ‘లైలా ఓ లైలా’ షూటింగ్  జరుగుతోంది. మరికొన్ని సినిమాలకు              సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
 
సాక్షి : కథ ఓకే అరుుతే మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా?

వరుణ్ : మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. నేను స్టార్ అని అనుకోవట్లేదు. నటుడిగానే భావిస్తున్నాను. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్‌బాబు, మనోజ్ సోదరులతో కలిసి చేశాను. అలాగే, ‘డి ఫర్           దోపిడీ’లో సందీప్‌కిషన్‌తో కలిసి నటించా. కథ కుదిరితే మల్టీస్టారర్‌లో తప్పక నటిస్తా.
 
 విజయవాడ ఎలా ఉంది?

 విజయవాడ సూపర్బ్. గతంలో  నాలుగైదు సార్లు ఇక్కడకు వచ్చాను. బుధవారం రాత్రి కేబీఎన్ కళాశాల మేనేజ్‌మెంట్ మీట్‌లో పాల్గొన్నాను. విద్యార్థులంతా నన్ను చక్కగా   ఆదరించారు. మొదటిసారిగా కనక   దుర్గమ్మను దర్శించుకున్నాను.           ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం.
 

మరిన్ని వార్తలు