కళింగుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

13 Dec, 2018 08:02 IST|Sakshi
జగన్‌ను కలిసి వినతిపత్రం ఇస్తున్న కళింగసీమ సేవా సమితి ప్రతినిధులు

శ్రీకాకుళం అర్బన్‌: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కళింగ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కళింగసీమ సేవాసమితి ప్రతినిధులు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ప్రజా      సంకల్ప పాదయాత్రలో భాగంగా బుధవారం  కృష్ణాపురం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కళింగసీమ సేవాసమితి ప్రతినిధులు హనుమంతు కృష్ణారావు, చింతాడ రామారావు, కొంక్యాణ వేణుగోపాల్‌ తదితరులు జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జనాభా పరంగా కాళింగ కులస్తులు రెండో స్థానంలో ఉన్నారని, పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్ల పరంగా ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. రాజకీయ, సామాజిక, ప్రభు త్వ నామినేటెడ్‌ పదవులలో తమ కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. కాళింగుల వలసలు నివారించేందుకు జనాభా ప్రాతిపదికన మైనారిటీ కులంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిపైనా జగన్‌ సానుకూలంగా స్పందిం చడంతో సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో కళింగసీమ సేవాసంఘం ప్రతినిధులు కూన సింహాచలం, మూల నారాయణరావు, పేడాడ రాజశేఖర్, పూజారి చల్లయ్య, మొదలవలస లీలామోహన్‌రావు, మార్పు మన్మధరావు  తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు