టీటీడీ బంపర్‌ ఆఫర్‌!

29 Oct, 2019 12:48 IST|Sakshi

సాక్షి, చిత్తూరు(తిరుమల): వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీరికి టీటీడి ప్రత్యేకదర్శనం కల్పిస్తోంది. 4వేల టోకెన్లను ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది. 

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణరోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తారు. 


 

>
మరిన్ని వార్తలు