పల్లెరేడు.. కొలువు దీరేది నేడు

2 Aug, 2013 05:08 IST|Sakshi

ఇందూరు/మోర్తాడ్/ఆర్మూర్‌రూరల్,న్యూస్‌లైన్:  ప్రత్యేకాధికారుల ఇరవై మూడు నెలల పాలనకు తెరపడింది. నేటి నుంచి జిల్లాలోని 716 పంచాయతీల్లో సర్పంచ్‌ల పాలన మొదలుకానుంది. వేల్పూరు మండలం కోమన్‌పల్లి. వెంకటాపూర్‌లో ఈనెల 8న ఎన్నికలు జరగను న్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం సా ధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు శుక్రవారం తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2011 ఆగస్టు 23తో ముగిసిపోయింది. ప్రభుత్వం వెంటనే ఎన్నికలను నిర్వహించకుండా గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఒక్కో ప్రత్యేకాధికారికి మూడు, నాలుగు పంచాయతీ ల బాధ్యతలను అప్పగించారు. వీరు 23 నెలల ఎనిమిది రోజుల పాటు విధులు చేపట్టారు. పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం తో నేటితో ప్రత్యేక పాలనకు తెరపడనుంది.
 
 విజయోత్సవాలకు సిద్ధం..
 ఎన్నికల సందర్భంగా గ్రామాలలో పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు విజయోత్సవాలు నిర్వహించలేకపోయారు. పోలీసు యాక్ట్ ఎత్తివేసినందున ప్రమాణస్వీకార వేళ సం బరాలను జరుపుకునేం దుకు సర్పంచ్‌లు ఏర్పా ట్లు చేసుకున్నారు.
 
 ముస్తాబవుతున్న పంచాయతీ..
 తేలిపోయిన రంగులతో అంధవికారంగా తయారైన గ్రామ పంచాయతీ లు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఎన్నికైన సర్పంచులు పం చాయతీ భవనాలకు కొత్త రంగులు, సున్నం వే యించారు. సొంత డబ్బులతో గ్రామంలో పనులకు శ్రీకారం చుట్టారు.
 
 మంచిరోజు చూసుకున్నాకే బాధ్యతలు..
 ఈరోజు ప్రమాణ స్వీకారమైతే చేస్తాం కానీ బా ధ్యతలు మాత్రం మంచిరోజు చూసుకున్నాకే చేపడతామంటున్నారు కొత్త సర్పంచులు. ఈ నెల ఆరున ఆషాడ ఆమావాస్య ఉన్నందున దా ని కంటే ముందు బాధ్యతలను స్వీకరించడానికి  సిద్ధంగా లేరు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్ర కారం శుక్రవారమే బాధ్యతలను అప్పగిస్తామని ప్రత్యేకాధికారులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరు మూడు నుంచి ఆరు గ్రామపంచాయితీలకు బాధ్యులుగా ఉన్నందున కొత్తసర్పంచ్‌లకు అప్పగించి చేతులు దులుపుకోవాలని భా విస్తున్నారు. మరోవైపేమో కొత్తసర్పంచులు సెంటిమెంటు అడ్డువస్తోందని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు