బాలల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక

31 Aug, 2014 01:13 IST|Sakshi

 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :జిల్లాలో బాలల రక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, దత్తత అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సమీకృత బాలల రక్షణ కార్యక్రమాలపై ప్రతినెలా సమీక్షిస్తామన్నారు. బాలలకు సంబంధించిన అన్ని అంశాలపై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పిం చేందుకు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశిం చారు.
 
 బాల్య వివాహాలను నిరోధించే విషయంలో అశ్రద్ధ వహిస్తే సంబంధిత తహసిల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు కూడా తమవంతు కృషి చేయూలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపాలని ఏఎస్పీ చంద్రశేఖరరావుకు కలెక్టర్ సూచించారు. భిక్షాటన చేస్తున్న బాలలకు పునరావాసం కల్పించేం దుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో బాలల రక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమైనట్టు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. బాలల దత్తత విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. బాలల అక్రమ రవాణా నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 తాడేపల్లిగూడెం లోని బ్యూటీపార్లర్‌లో ఐదేళ్ల బాలికను హింసించిన ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో బాలుడు విద్యుత్ షాక్‌కు గురై చెరుు్య కోల్పోయూడని, ఇందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా బాలల సంరక్షణ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ ఆర్.సూయిజ్, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల, బాలల అక్రమ రవాణా నిరోధక కమిటీ సభ్యురాలు టి.విజయనిర్మల, డీసీపీవో సీహెచ్.సూర్యచక్రవేణి, డీఎంహెచ్‌వో కె.శంకరరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు