మే రెండోవారం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ

26 Apr, 2017 02:26 IST|Sakshi
మే రెండోవారం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ

అమరావతి: ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మే రెండోవారం తర్వాత ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కోడెల పేర్కొన్నారు.

మహిళా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో డిక్లరేషన్‌ను రూపొందిస్తున్నామని, ఇందుకోసం కోర్‌ కమిటీ, సలహా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్‌ 30 నాటికి అమరావతి డిక్లరేషన్‌ను రూపొందిస్తామని స్పీకర్‌ తెలిపారు. కాగా స్పీకర్‌ కార్యాలయానికి రాజీనామాలు ఏమైనా వచ్చాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, స్పీకర్‌ మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు.

మరిన్ని వార్తలు