టీడీపీ నేత రెస్ట్రూమ్లో పేకాట

29 Jul, 2015 09:31 IST|Sakshi
జూదురుల నుండి స్వాధీనం చేసుకున్న డబ్బుతో సీఐ ప్రసాదరావు, సిబ్బంది

9 మంది అరెస్ట్  రూ. 21 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం
- గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ తెలుగుదేశం నాయకుడి రెస్ట్‌రూంలో పెద్ద స్థాయిలో  పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారినుంచి రూ. 21.74 లక్షల నగుదు, 11 ఏటీఎం కార్డులు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాల మేరకు...  జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని యస్‌యల్‌వి థియేటర్ సమీపంలో టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు రాణా ప్రతాప్ రెస్ట్‌రూమ్‌పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
పేకాట ఆడుతున్న పట్టణానికి చెందిన రాణా ప్రతాప్ అనుచరులు  సూర్యనారాయణ, సత్యనారాయణ, హఫీజ్ ఖాన్‌లతో పాటు రాయచూరు తదితర ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఎండి.ఆరీఫ్, వి.వెంకటే ష్, రాఘవ, ఎం.జయరామ్, కుమార్‌లను అరెస్ట్ చేశారు.  మట్కా, పేకాట ఆడుతూ రూ. 50 వేలతో పట్టుబడే నిందితులను మీడియా ముందుకి చూపే పోలీసు అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో పట్టుబడిన పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను మీడియా ముందుకు చూపడానికి వెనుకంజ వేశారు. వివరాలు చెప్పాలని పాత్రికేయులంతా గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో కేవలం స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రమే చూపి చేతులు దులుపుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు