ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు

21 Aug, 2015 02:45 IST|Sakshi
ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు

♦ ఈ నెల 29న జరిగే రాష్ట్ర బంద్‌ని విజయవంతం చేయాలి
♦ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
♦ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించాలి
♦ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపు
 
 ఒంగోలు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 29న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రాష్ట్ర బంద్ నిర్వహణపై స్థానిక  పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుంటే భావితరాలు ఇబ్బందులు పడతారని అన్నారు.   ప్రతి ఒక్కరూ బంద్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కనీసం రాజధాని కూడా లేని మన రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందాలంటే ప్రత్యేక హోదా ఉండి తీరాలన్నారు.  

 చంద్రబాబు నోరు మెదపడే...
 జిల్లా పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి ప్రజలను నిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపడం లేదని మండిపడ్డారు.  

 ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం
 ప్రత్యేక హోదా సాధన కోసం మంగళగిరిలో,  ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేసి కేంద్రానికి మన వాణిని గట్టిగా వినిపించామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.  ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్ పిలుపు మేరకు రాష్ట్ర  బంద్‌ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాకుంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు.  మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు రాష్ట్రానికి కరువు వచ్చిందని ఇప్పుడు అదేవిధంగా బాబు వచ్చే...కరువు వచ్చే అనే లా ఉందని ఎద్దేవా చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.  

  యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రబంద్‌కు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ మొద్దు నిద్రపోయే ప్రభుత్వాలను తన్ని నిద్రలేపాలని అందుకే ఈ రాష్ట్రబంద్‌కు తమ అధ్యక్షుడు పిలుపునిచ్చాడని అన్నారు.  

  సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, కొండపి నియోజకవర్గ  ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు, పర్చూరు ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు దామరాజు క్రాంతికుమార్, సేవాదళ్ అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, నాయకులు వై.వెంకటేశ్వర్లు, పిచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, రవికుమార్ యాదవ్ తదితరులు  మాట్లాడారు.

కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆదెన్న, ఇతర నాయకులు బడుగు ఇంది ర, శింగరాజు రాంబాబు, కె.వి.ప్రసాద్, రమణయ్య మాస్టర్, తోటపల్లి సోమశేఖర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు