ప్రజా వారధి..హోదా సారథి

22 Mar, 2019 12:12 IST|Sakshi

సాక్షి, పెడన(కృష్ణా) : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు భవితకు బంగారు బాటలు పడతాయనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేక హోదాయే ఆంధ్రాకు కావాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఢంకా పధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేస్తూనే ఉన్నారు.

టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అంటూనే యూటర్న్‌ తీసుకుని  ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీయే ముద్దని పేర్కొంటూ మళ్లీ యూటర్న్‌ తీసుకుని బీజేపీతో తెగతెంపులు చేసుకుని మొసలికన్నీరు కారుస్తూ ప్రత్యేక హోదా అంటూ రాగం అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఓటరు పేర్కొవడం గమనార్హం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాకుండా  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అంటున్నారు.

చంద్రబాబు వల్లే రాలేదు
చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి తీసుకోవడంతోనే ప్రత్యేక హోదా రాకుండా పోయింది. హోదా వస్తే రాష్ట్రానికి మహర్దశ పట్టేది.  హోదాను తన ఓటుకు నోటు కేసు కోసం ఫణంగా పెట్టిన చంద్రబాబును రాష్ట్ర యువత తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి హోదా కోసం మడమ తిప్పకుండా పోరాడుతుంది ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమే.  హోదా సంజీవనా అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మళ్లీ హోదా రాగం తీయడం చంద్రబాబు నీచ సంసంస్కృతికి నిదర్శనం.  హోదా కోసం అలుపెరగని పోరాడుతున్న జగన్‌ను రానున్న ఎన్నికలలో గెలిపించి హోదా సాధించుకుంటాం. 
– పోతన సుధాకర్, గూడూరు.

నమ్మక ద్రోహి చంద్రబాబు
గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ఏ హామీ పూర్తిగా నెరవేర్చలేదు. హోదా వద్దు దాని వల్ల ఏం లాభం అన్న వ్యక్తి మళ్లీ హోదా కావాలంటే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు. గతంలో వ్యవసాయం దండగ అన్నాడు. ఇప్పుడు వ్యవసాయం రంగం అభివృద్ధిలో ఉంది అంటున్నాడు. అలాగే హోదా విషయంలోనూ చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభించి ప్రజలను తప్పుదారి పట్టించాడు. హోదా అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించాడు.  ప్రజా సంకల్పయాత్రతో ప్రజలు వాస్తవాలను గుర్తించారు కాబట్టి జగనన్నతో కలసి నడిచేందుకు సిద్ధపడి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
–మాదాసు నాగేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, పెందురు 

జగన్‌తోనే హోదా సాధ్యం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌మోహనరెడ్డి హోదా  కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ఈ యాత్రలో జగన్‌కు లభించిన ఆదరణ చూసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని దీక్షలు చేశారు. రాష్ట్రానికి  నష్టం జరిగిన  తర్వాత చంద్రబాబు దీక్షలు చేస్తే  ఎవరు ఆదరిస్తారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో ఇబ్బడి, ముబ్బడిగా అప్పులు చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రజలను రక, రకాల తాయిలాలతో ఊదరగొడితే జనం నమ్మి  పట్టం కడతారనుకోవడం బ్రమే. ప్రజా సంకల్ప యాత్రలో లభించిన ప్రజాబిమానం  జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
–సీహెచ్‌. రాధాకృష్ణ, మాజీ సర్పంచ్, సాతులూరు 

మరిన్ని వార్తలు