గమ్యం చేరని ప్రయాణం

15 Jun, 2018 12:48 IST|Sakshi

ఫుట్‌బోర్డులో ప్రయాణాలతో ప్రమాదం

పట్టాలు దాటుతూ ఘటనలు

రక్తసిక్తమవుతున్న రైలు పట్టాలు

బిట్రగుంట: రైల్వే అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల అవగాహనా లోపం వెరసి రైలు పట్టాలు తర చూ రక్తసిక్తమవుతున్నాయి. ప్రతి ఏటా ఆం దోళన కలిగించే స్థాయిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లలో విపరీతమైన రద్దీ కారణంగా ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ, కదులుతున్న రైల్లోంచి ది గాలని ప్రయత్నిస్తూ, వేగంగా వెళ్తున్న రైలును చివరి క్షణంలో అందుకోవాలని ప్రయత్నిస్తూ ప్ర మాదవశాత్తు జారిపడి రైలు చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇంకొందరు దూరం తగ్గించేందుకు రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఒక్కరోజే నెల్లూరు–కావలి స్టేషన్ల మధ్య వేర్వేరు ప్రమాదాల్లో రైలు పట్టాలపై నలుగురు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోం ది. ప్రయాణికుల భద్రతపై అవగాహన కలిగించాల్సిన రైల్వే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా నమోదవుతుంది.

ఆచూకీ దొరకడం కష్టమే
రైలు పట్టాలపై విగత జీవులుగా మారుతున్న వారిలో గుర్తుతెలియని మృతదేహాలే అధికం. ఎక్కడి నుంచి ఎక్కడికో రైల్లో ప్రయాణిస్తూ మధ్యలో ప్రమాదవశాత్తు జారిపడుతుండటంతో వీరి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యంకావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నా సాధ్యం కావడం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారుతుంది. దీంతో సగం మంది వివరాలు కూడా పోలీసులు కనిపెట్ట లేకపోతున్నారు. మరో వైపు తమవారు ఏమైపోయారో తెలియక మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఏళ్ల తరబడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ప్రమాదాలకు ఇవి కారణాలు
అధిక శాతం మంది ప్రయాణికులు అవగాహనా లోపం కారణంగానే ప్రమాదాల బారిన పడుతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తూ నిద్రమత్తులో జారిపడటం, పరుగెడుతున్న రైలును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెల్‌ఫోన్‌లో మాట్లాడు తూ, ఇయర్‌ ఫోన్స్‌లో పాటలు వింటూ పట్టాలు దాటే వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నా రు. రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచడం, ఆటోమేటిక్‌ లాక్‌ సౌకర్యం ఉండే తలుపులు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉన్నా రైల్వేశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఫుట్‌బోర్డు ప్రయాణాలపై అవగాహన కూడా కలిగించడం లేదు.

మరిన్ని వార్తలు