సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు

31 May, 2015 08:16 IST|Sakshi

హైదరాబాద్ : వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.  07201 నెంబర్ గల రైలు కాకినాడలో జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి జూన్ 2న (07202) సికింద్రాబాద్‌లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది.

మరిన్ని వార్తలు