దసరాకు ప్రత్యేక రైళ్లు

14 Oct, 2018 14:00 IST|Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా రద్దీ దృష్ట్యా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు.

రాజమండ్రి–విజయనగరం–రాజమండ్రి (మెము స్పెషల్‌)
రాజమండ్రి–విజయనగరం(17769)మెము స్పెషల్‌ రాజమండ్రిలో ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయనగరంలో(17770) 22వ తేదీ ఉదయం 7.45గంటలకు బయల్దేరి అదే రోజు మ«ధ్యాహ్నం 12.30 గంటలకు రాజ మండ్రి చేరుకుం టుంది.

విజయనగరం–విజయవాడ
(మెము) (07771) ఈనెల 17వ తేదీ రాత్రి 9.35గంటలకు విజయనగరంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు కొత్తవలస, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్పీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, నూజివీడు స్టేషన్‌లలో ఆగుతుంది. 

విజయవాడ–విజయనగరం–విజయవాడ(మెము స్పెషల్‌)
విజయవాడ–విజయనగరం(07772) స్పెషల్‌ విజయవాడలో ఈనెల 18వ తేదీ రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో విజయనగరంలో ఈనెల 19వ తేదీ ఉదయం 7.45 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు నూజీవీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

భువనేశ్వర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ తత్కాల్‌ స్పెషల్‌
భువనేశ్వర్‌–బెంగళూరు తత్కాల్‌ స్పెషల్‌ (02510) భువనేశ్వర్‌లో ఈనెల 15న ఉదయం 7.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.40 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు ఖుర్దారోడ్, బలుగాం, బెరంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, పెరంబూర్, అరక్నోణం, కాట్పడి, జాలర్‌పేట, బంగార్‌పేట, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.  

మరిన్ని వార్తలు