పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

28 Sep, 2019 11:23 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే విభాగం ప్రకటించింది. ఒంగోలు రైల్వేస్టేషన్లో ఆగే సదుపాయం ఉన్న ఈ రైళ్లు డిసెంబర్‌ వరకు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో దసరా, దీపావళి, క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సరం వరకు ప్రయాణీకులకు ఎంతో సదుపాయంగా ఉండనుంది.

రైలు నంబర్‌ 06338 
ఈ రైలు చెన్నై సెంట్రల్‌ నుంచి బయల్దేరి గౌహతి వరకు వారానికి ఒకసారి నడుస్తుంది. చెన్నై సెంట్రల్‌లో సోమవారం ఉదయం 6.05 గంటలకు బయల్దేరి బుధవారం 14 గంటలకు గౌహతికి చేరుకుంటుంది. ఈ రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు 11.22 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలుకు ఏసీ 2టైర్‌–1, ఏసీ 3టైర్‌–2, స్లీపర్‌–11, జనరల్‌ సెకండ్‌క్లాస్‌–2, లగేజ్‌కం బ్రేక్‌ వ్యాన్స్‌–2 కోచ్‌లు అమర్చారు. ఒంగోలులో ఎక్కిన ప్రయాణికునికి మన రాష్ట్రంలో తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని,అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవసల, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస మీదుగా ఒడిశా రాష్ట్రం నుంచి గౌహతికి చేరుకుంటుంది. అక్టోబరు 7, 14, 21, 28, నవంబరు 4, 11, 18, 25, డిసెంబర్‌ 2, 9, 16, 23, 30 తేదీలలో ఒంగోలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

రైలు నంబర్‌ 06058 
ఈ రైలు చెన్నై సెంట్రల్‌ నుంచి 15.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 19 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది. అక్టోబరు 9, 16, 30, నంబరు 6, 13, 20, 27, డిసెంబర్‌ 4, 11, 18, 25 తేదీలలో ఒంగోలు రైల్వే ప్రయాణికులకు 19.36 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఏసీ 2టైర్‌–1, ఏసీ 3టైర్‌–4, స్లీపర్‌–12, లగేజ్‌కం బ్రేక్‌ వ్యాన్‌లు–2 బోగీలు అమర్చారు. ఈ రైలు మన రాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, పలాస మీదుగా సంత్రాగచ్చికి చేరుకుంటుంది.

రైలు నంబర్‌ 06010 
ఈ రైలు పుదుచ్చేరిలో శనివారం 18.45 గంటలకు బయల్దేరి సోమవారం 4.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. అక్టోబరు 19, నవంబరు 3, 10, 17, 24, డిసెంబర్‌ 8, 15, 22, 29 తేదీలలో ఒంగోలు ప్రయాణికులకు 04.38 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలుకు ఏసీ 2 టైర్‌–1, ఏసీ 3 టైర్‌–1, స్లీపర్‌–7, జనరల్‌ సెకండ్‌క్లాస్‌–6, లగేజ్‌ కం బ్రేక్‌ వ్యాన్‌లు 2 బోగీలు అమర్చారు. ఈ రైలు మార్గమధ్యలో మన రాష్ట్రంలో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస మీదుగా ఒడిశ రాష్ట్రం నుంచి సంత్రాగచ్చి చేరుకుంటుంది. 

రైలు నంబర్‌ 82622 
ఈ రైలు అక్టోబరు 2న చెన్నై సెంట్రల్‌ నుంచి 15:15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 19 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఏసీ 2 టైర్‌–1, ఏసీ త్రీటైర్‌–4, స్లీపర్‌–12, లగేజ్‌ కం బ్రేక్‌వ్యాన్‌లు–2 అమర్చారు. ఈ రైలు మన రాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, పలాస మీదుగా సంత్రాగచ్చి చేరుకుంటుంది. 

రైలు నంబర్‌ 82620 
ఈ రైలు పుదుచ్చేరిలో అక్టోబరు 12న శనివారం 18.45 గంటలకు బయల్దేరి సోమవారం 4.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఈ రైలుకు ఏసీ 2టైర్‌–1, ఏసి 3టైర్‌–1, స్లీపర్‌–7, జనరల్‌ సెకండ్‌క్లాస్‌–6, లగేజ్‌కం బ్రేక్‌వ్యాన్‌–2 బోగీలు అమర్చారు. మన రాష్ట్రంలో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, పలాస మీదుగా సంత్రాగచ్చి చేరుకుంటుంది.

>
మరిన్ని వార్తలు