వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

22 Jun, 2019 13:17 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌–కొచ్చివేలి ప్రత్యేక రైలు (07115) జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీల్లో రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20కి  కొచ్చివేలి చేరుకుంటుంది. కొచ్చివేలి–హైదరాబాద్‌ రైలు (07116) జూలై 8, 15, 22, 29, ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్‌ 2వ తేదీల్లో ఉదయం 7.45 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

హైదరాబాద్‌–ఎర్నాకుళం ప్రత్యేక రైలు (07117) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో, ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. ఎర్నాకుళం–హైదరాబాద్‌ రైలు (07118) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30కు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కు హైదరాబాద్‌ చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్‌–సంత్రాగచి రైలు (06058) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో మధ్యాహ్నం 3.15కు చెన్నైలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.00 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది.

సంత్రాగచి – చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు (06057) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1వ తేదీల్లో రాత్రి 11.50కు సంత్రాగచిలో బయల్దేరి రెండో రోజు ఉదయం 5.30కు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. పుదుచ్చేరి –సంత్రాగచి రైలు (06010) జూలై 6, 13, 20, 27వ తేదీల్లో సాయంత్రం 6.45కు పుదుచ్చేరిలో బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 4.30కు సంత్రాగచి చేరుకుంటుంది. సంత్రాగచి–పుదుచ్చేరి ప్రత్యేక రైలు (06009) జూలై 8, 15, 22, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2.10కు సంత్రాగచిలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 9.45కు పుదుచ్చేరి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని,ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రప్రసాద్‌ కోరారు.

మరిన్ని వార్తలు