పండగ వేళ ప్రత్యేక రైళ్లు

20 Dec, 2019 08:19 IST|Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పలు మార్గాలలో స్పెషల్, రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ (వయా దువ్వాడ)ల మధ్య ఏసీ స్పెషల్‌ భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ (08407)వీక్లీ ఏసీ స్పెషల్‌ ప్రతి గురువారం భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి దువ్వాడకు 9.17 గంటలకు చేరుకుని అక్కడ నుంచి 9.19 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ జనవరి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08408) సికింద్రాబాద్‌లో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.38గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడ నుంచి 9.40గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 3వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్డు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈరైలు 16 ఏసీ త్రీటైర్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లతో నడుస్తుంది.

 విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ 
విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08501)వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి మంగళవారం రాత్రి 11గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు మ«ధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 7వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08502) సికింద్రాబాద్‌లో ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 8వ తేదీ నుంచి ఏíప్రియల్‌ 1వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు 1–సెకండ్‌ ఏసీ, 3–థర్డ్‌ ఏసీ, 10–స్లీపర్‌ క్లాస్, 6–జనరల్‌ సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.

విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నం మధ్య.. 
విశాఖపట్నం–తిరుపతి (08573) వీక్లి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో ప్రతి సోమవారం రాత్రి 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 6వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08574)ఎక్స్‌ప్రెస్‌ ప్రతి మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 7వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైలు రానుపోను దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్తూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు 2–సెకండ్‌ ఏసీ, 4–థర్డ్‌ ఏసీ, 9–స్లీపర్‌క్లాస్, 5–జనరల్‌ సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. 
(సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా