వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

28 Jun, 2019 11:18 IST|Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలునెంబరు (02784) సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు జూలై 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31, ఆగస్ట్‌ 3, 7, 10, 14, 17, 21, 24,28, 31, సెప్టెంబర్‌ 4, 7, 11, 14, 18, 21, 25, 28వ తేదీల్లో మధ్యాహ్నం 12.30గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు భువనేశ్వర్‌ చేరుతుందన్నారు. రైలునెంబరు (02783) భువనేశ్వర్‌ –సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు జూలై 4, 7, 11, 14, 18, 21, 25, 28, ఆగస్ట్‌ 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 సెప్టెంబర్‌ 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29వ తేదీల్లో సాయంత్రం 6గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందన్నారు.

రైలునెంబరు (07016) కాచిగూడ–విశాఖపట్నం ప్రత్యేక రైలు జూలై 2, 9, 16, 23, 30 ఆగస్ట్‌ 6, 13, 20, 27 సెప్టెంబర్‌ 3, 10, 17, 24వ తేదీల్లో సాయంత్రం 6.45గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది. రైలునెంబరు(07479) విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు జూలై 3, 10, 17, 24, 31 ఆగస్ట్‌ 7, 14, 21, 28 సెప్టెంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 7.05గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.25కు తిరుపతి చేరుతుందన్నారు. రైలునెంబరు(07146) తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25, ఆగస్ట్‌1, 8, 15, 22, 29, సెప్టెంబర్‌ 5, 12, 19, 26వ తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుతుందన్నారు.  

మరిన్ని వార్తలు