వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

13 Mar, 2019 10:04 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో రాజేంద్ర ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (08501) ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.00 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–విశాఖ రైలు (08502) ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 4.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.

విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు (08573) ఏప్రిల్‌ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 10.55కు విశాఖ బయలుదేరుతుంది. తిరుపతి–విశాఖపట్నం రైలు (08574) ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30 మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో మధ్యాహ్నాం 3.30కు తిరుపతిలో బయలుదేరుతుంది.

జబల్‌పూర్‌–తిరునల్వేలి ప్రత్యేక రైలు..
జబల్‌పూర్‌–తిరునల్వేలి ప్రత్యేక రైలు (02194) ఏప్రిల్‌ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 9.30కు జబల్‌పూర్‌లో బయలుదేరుతుంది. తిరునల్వేలి–జబల్‌పూర్‌ రైలు (02193) ఏప్రిల్‌ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5.45కు తిరునల్వేలిలో బయలుదేరుతుంది.

మచిలీపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07049) ఏప్రిల్‌ 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.05కు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–మచిలీపట్నం రైలు (07050) ఏప్రిల్‌ 7, 14, 21, 28వ తేదీల్లో రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.

నర్సాపూర్‌–హైదరాబాద్‌ రైలు (07258) ఏప్రిల్‌ 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్‌–విజయవాడ రైలు (07257) ఏప్రిల్‌ 8, 15, 22, 29వ తేదీల్లో రాత్రి 10.20కి హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.35కు విజయవాడ చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రాజశేఖర్‌ కోరారు. 

మరిన్ని వార్తలు