‘సర్వ ఏకాదశి’కి తిరుమల ముస్తాబు

26 Jun, 2019 16:01 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిని అంగరంగ వైభంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. అందులో భాగంగా వచ్చే నెల ఏడవ తేదీన శ్రీ మరీచి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆ తరువాత జూలై 12న శయన ఏకాదశితో పాటు చాతుర్మాస్య వ్రతారంభాన్ని పురస్కరించుకుని విశిష్ట పూజలు చేపట్టనున్నారు. జూలై 16న గురుపౌర్ణిమ, చంద్రగ్రహణం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జూలై 28న సర్వ ఏకాదశి వేడుకకు తిరుమల దేవస్థానం ఇప్పటినుంచే సర్వాంగ సుందరంగా ముస్తాబవనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా