స్మార్ట్‌ సిటీ పనులు వేగవంతం చేయండి

8 Mar, 2018 09:29 IST|Sakshi
తిరుపతి స్మార్ట్‌ సిటీపై అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న

తిరుపతి మంగళం : తిరుపతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ పిఎస్‌.ప్రద్యుమ్న ఆదేశించా రు. తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం కార్పొరేషన్‌ కమిషనర్‌ హరికిరణ్, అధికారులతో ఆయన సమీక్షించారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని వీధులలో పనులను పూర్తి అధికారులకు సూచిం చారు. ఒకినోవా బ్యాటరీ ఆపరేటెడ్‌ చెత్త సేకరణ వాహనాలు 30 రోజుల్లో నగరానికి చేరుకోవాలని, ఏఇకమ్‌–డెలాయిట్‌ ప్రాజె క్ట్‌ అధికారులకు సూచించారు. వినాయకసాగర్, పార్కుల అభివృద్ధి, అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ లైన్ల పనులకు వెంటనే పూనుకోవాలన్నారు.  అమృత్‌ పథకం కింద తిరుపతిలో రూ.252 కోట్లకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. తాగునీటి సరఫరా, పార్కింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌ వంటి అత్యవసరాన్ని గుర్తించి పనులను ప్రారంభించాలన్నారు.  జేసీ గిరీషా, తిరుపతి సబ్‌ కలెక్టర్‌ నిషాంత్‌కుమార్, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

అందరికీ న్యాయం చేస్తాం
శెట్టిపల్లి భూములలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామని జేసీ గిరీ షా హామీ ఇచ్చారు. తన కార్యాలయంలో బుధవారం శెట్టిపల్లి భూముల కొనుగోలు దారులతో ఆయన సమావేశమయ్యారు. శెట్టిపల్లి లెక్క దాఖలాల్లో పేదలు కొనుగోలు చేసిన 140 ఎకరాలలో 12 నుంచి 18వ తేదీ వరకు సర్వే చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు