పైకి కనిపించేదంతా నిజం కాదు!

6 Aug, 2019 11:14 IST|Sakshi
వీఆర్సీ సెంటర్‌లో జ్యూస్‌ దుకాణంలో నిల్వ ఉన్న పండ్లు

నిల్వ ఉంచి మురగబెట్టిన మాంసంతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్ల బండారం బట్టబయలైంది. హోటల్లోని ఫ్రిజ్‌ల్లో గుట్టగుట్టలుగా మాంసాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఇప్పుడేమో కుళ్లిపోయిన పండ్లు, నిల్వ ఉంచిన పనికిరాని వాటితో జ్యూస్‌ చేసి ప్రజలతో కాలకూట విషాన్ని తాగించేస్తున్నారు. ఇది చూసిన అధికారులు నివ్వెరపోయారు. ‘మీ ఇంట్లో ఇటువంటివి తింటారా? తాగుతారా?’ అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, నెల్లూరు: కార్పొరేషన్‌ కమిషనర్‌ మూర్తి నేతృత్వంలో ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు, నగరపాలక సంస్థ హెల్త్‌ అధికారులు సోమవారం నెల్లూరు నగరంలో పలు జ్యూస్‌ షాపులు, హోటళ్లలో తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన మామిడికాయలు, మందులు పెట్టి మాగపెట్టిన పండ్లు, నిల్వ ఉంచిన జ్యూస్‌లను అధికారులు గుర్తించి విస్తుపోయారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్సీ సెంటర్‌లోని లీలామమల్‌ పక్కనున్న సిమ్లా జ్యూస్‌ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి చెడిపోయిన పండ్లను కనుగొన్నారు. ఇటువంటివి వాటితో జ్యూస్‌ చేసి ప్రజలకు విక్రయించి వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం ఏమిటని కమిషనర్‌ మూర్తి నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా అని ప్రశ్నించారు.

ఇలా మరోసారి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా నిల్వఉంచిన మాంసం, పండ్లు, జ్యూస్‌లు విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిమ్లా జ్యూస్, వీఆర్సీ సెంటర్‌లోని వైఎస్సార్‌ జ్యూస్‌ షాపుల్లో తనిఖీలు చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. కనీసం పరిశుభ్రత పాటించడం లేదన్నారు. ఇలాంటి చోట తయారైన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు తీసుకోవడం ద్వారా తెలియని అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. మొత్తంగా 100 కేజీల చెడిపోయిన పండ్లు, 50 లీటర్ల జ్యూస్‌ను పారవేడయం జరిగిందన్నారు. 

నిల్వ ఉంచిన మాంసం గుర్తింపు
కార్పొరేషన్‌ హెల్త్‌ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ వీఆర్సీ సెంటర్‌లోని మయూరి హోటల్‌లో తనిఖీలు చేయడంతో అక్కడ నిల్వ ఉంచిన మాంసం  ఉందన్నారు. అలాగే పక్కనే ఉన్న వెంకటరమణ హోటల్‌లో కూడా తనిఖీలు చేశామన్నారు. తేదీ లేని వివిధ రకాల ఆహార పదార్థాలున్నట్లుగా గుర్తించామన్నారు. వీటితో పాటు వహాబ్‌పేటలోని మాంసం దుకాణాల్లో తనిఖీలు చేయగా 100 కేజీల నిల్వ ఉంచిన మాంసంను గుర్తించడం జరిగిందన్నారు. వీటిని స్వాధీనం చేసుకుని పారవేయడం జరిగిందన్నారు. మొత్తంగా ఒక్క రోజులో రూ.70 వేల ఫైన్‌ వేయడం జరిగిందన్నారు. నిత్యం ఈ దాడులు జరుగుతుంటాయన్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే వాటిని విక్రయస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

కొనసాగుతున్న వరదలు..

13 మంది ఉపాధి సిబ్బంది సస్పెన్షన్‌

స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

పోస్టు ఇవ్వకపోతే ప్రాణం దక్కదు.. జాగ్రత్త!

చిక్కిన చీటింగ్‌ ముఠా 

ఇండస్ట్రియల్‌ హబ్‌గా దొనకొండ

ఒకరి పొరపాటు.. ఇంకొకరికి గ్రహపాటు

అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!

కౌలు కష్టం దక్కనుంది

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

ఇంటికెళ్లి తాగాల్సిందే..!

అనూహ్య‘స్పందన’

ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్‌

బతుకు లేక.. బతకలేక..!

ఉద్యోగాల విప్లవం

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

ఆరో రోజూ...అదే ఆగ్రహం 

కేశవదాసుపురంలో రెండో రోజూ ఉద్రిక్తత

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం..

8న సీఎం పులివెందుల పర్యటన

సేవకు సంసిద్ధం 

ఇంటి నుంచే స్పందన

సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి

తప్పులు చేసి నీతులు చెబుతారా?

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

ఆర్టికల్‌ 370 రద్దు భారతావనికి వరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే