శ్రీచైతన్యవి నిరాధార ఆరోపణలు

5 May, 2018 01:48 IST|Sakshi

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటన 

‘శ్రీశార్వాణి’ ఒప్పందం పూర్తయ్యే వరకు ర్యాంకులు ప్రకటించుకునే హక్కుంది

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శ్రీచైతన్య విద్యాసంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తున్నట్టు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణ మేథోసంపత్తి నుంచే చైనా ప్రోగ్రామ్‌ ఉద్భవించిందన్న సంగతి అందరికీ తెలుసునని పేర్కొంది. ‘‘2005, 2006, 2007 ప్రారంభంలో నారాయణ విద్యాసంస్థలు ఇదే ప్రోగ్రాంను నారాయణ సి.ఒ. స్పార్క్‌ పేరుతో ప్రారంభించింది నిజం కాదా? 2007లో ఇదే ప్రోగ్రాం నుంచి ఏఐఈఈఈ (నేటి జేఈఈ మెయిన్‌)లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు, 2008 లో 2, 4, 10.. 2009లో 3, 4, 6, 7.. వంటి ర్యాంకులను సాధించిన విషయం అందరికీ తెలిసిందే.

ఐఐటీలో 2008లో టాప్‌ 10లో 3, 4, 7, 8 ర్యాంకులు ఆ తర్వాత సంవత్సరాల్లో నూ అనేక ఉత్తమ ర్యాంకులన్నీ చైనా ప్రోగ్రామ్‌ తో సంబంధం లేకుండా నారాయణ విద్యాసంస్థలే సాధించాయి’’అని ప్రకటనలో పేర్కొన్నా రు. శ్రీశార్వాణి ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రారంభించేటప్పుడు, తెలుగు విద్యార్థులకు టాప్‌ ర్యాంకులు రావాలన్న నెపంతో తమను ఒప్పించి చైనా ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించింది. చైనా ప్రోగ్రామ్‌ కంటే ముందు ఐఐటీ ప్రో గ్రామ్‌ ద్వారా సాధించిన అత్యుత్తమ ర్యాం కులు ఏంటో శ్రీచైతన్య చెప్పగలదా అని ప్రశ్నించింది. 2012 వరకు నారాయణ విద్యార్థుల టాప్‌–10 ఐఐటీ ర్యాంకులెన్ని, శ్రీచైతన్య ర్యాంకులెన్ని అన్న విషయాన్ని ప్రజలకు చెప్ప గలరా అని పేర్కొంది.

2012 తర్వాత తాము రూపొందించిన ఐఐటీ ప్రోగ్రామ్‌ను కాపీ కొట్టి శ్రీచైతన్య లబ్ధి పొందిందని ఆరోపించింది. ‘టాప్‌ ర్యాంకుల సాధన కోసం శ్రీచైతన్యకు  ప్రణాళిక లేదన్నది నిజం. మేం రూపొందించి న విద్యాప్రణాళిక సాయంతో సాధించుకుంటు న్న ర్యాంకులను మా విద్యార్థులు, మా ప్రో గ్రా మ్‌ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం?’’అని ప్రశ్నించారు. శ్రీశార్వాణి  సొసైటీ ఒప్పందం ప్రకారం అందులో సమాన భాగస్తులం కాబట్టి, అది పూర్తయ్యే వరకు ఇరు యాజమాన్యాలకు టాప్‌ ర్యాంకులను ప్రకటించుకునేహక్కు ఉంటుందని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు