చెదిరిన హేమంతం

26 Jan, 2019 10:16 IST|Sakshi
మృతుడి ఇంటి వద్ద విచారంతో గ్రామస్తులు, (ఇన్‌సెట్‌) విద్యార్థి హేమంత్‌నాయుడు(ఫైల్‌ఫొటో)

శ్రీచైతన్య విద్యార్థి అనుమానాస్పద మృతి

సెల్‌ ఫోన్‌ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య!

తల్లిదండ్రులకు తీరని శోకం

బయపురెడ్డిపాలెంలో విషాదం

విశాఖపట్నం , నర్సీపట్నం: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ఇక లేడనే వార్తతో ఆ తల్లి తల్లడిల్లిపోతోం ది. కంటికి రెప్పలా చూసుకుంటున్న బాలుడి మృ తితో మండలంలోని బయపురెడ్డిపాలెంలో విషా దం చోటుచేసుకుంది. విశాఖపట్నం మారికవలస శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బయపురెడ్డి హేమంత్‌నాయుడు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీ రుగా విలపిస్తున్నారు. రమణబాబు, అమ్మాజీల కు ఇద్దరు పిల్లలు. పెద్దదైన పాప వేములపూడి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కుమారుడు హేమంత్‌నా యుడుని మారికవలస శ్రీచైతన్యలో ఈ ఏడాది చేర్పించారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపా డు.

తరువాత కాలేజీకి వెళ్లిన హేమంత్‌నాయుడు(16) గురువారం రాత్రి హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ గదిలో హేమంత్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఉంటున్నారు. శుక్రవా రం ఉదయం 5గంటల సమయంలో వార్డన్‌ నిద్రలేపే ప్రయత్నం చేయగా హేమంత్‌  సీలింగ్‌ హుక్‌కు వేలాడు తూ కనిపించాడు. అతడ్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేక పోయిందని తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇదే హాస్టల్‌ గదిలో ఉంటున్న మరో విద్యార్థికి చెందిన రు.14వేలు విలువైన ఫోన్‌ హేమంత్‌ చేతిలో పోయిందని, దీనిపై ఆ విద్యార్థి డబ్బులు అడగడంతో సంక్రాంతి సెలవులకు ముందు ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారం కళాశాల యాజమాన్యం దృష్టికి కూడా వెళ్లింది. ఈ పరిస్థితులే ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

ఏం జరిగిందో తెలియడం లేదు..
తన కుమారుడికి ఎలాంటి అనారోగ్యం లేద ని, ఆరోగ్యంగానే ఉన్నాడని తల్లి అమ్మాజీ తెలిపింది. చదువులో సైతం ముందంజలో నే ఉండేవాడని పేర్కొంది. సెలవులు అనంతరం సంతోషంగానే వెళ్ళాడని, ఇంతలో ఏమి జరిగిం దో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. క ళాశాల యాజమాన్యం నిర్వాకం కారణంగానే తన కుమారుడు చనిపోయి ఉంటాడని కన్నీటి పర్యం తమైంది. శుక్రవారం ఉదయం9 గంటల సమయంలో కళాశాల నుంచి ఫోన్‌ చేశారని, మీ అబ్బా యి హేమంత్‌నాయుడుకు  సీరియస్‌గా ఉందని, కేజీహెచ్‌కు తీసుకెళుతున్నామని చెప్పారన్నారు. వెంటనే తాను, తనభర్త  విశాఖ వెళుతుండగా బలి ఘట్టం సమీపంలోకి వచ్చే సరికి మీ అబ్బాయి చనిపోయాడని ఫోన్‌లో చెప్పారని విలపిస్తూ వివరించింది.  ముందు సీరియస్‌గా ఉందని చెప్పిన కళాశాల యాజమాన్యం కేవలం గంటవ్యవధిలోనే మళ్లీ ఫోన్‌చేసి చనిపోయినట్లు చెప్పడంపై అమ్మా జీ అనుమానం వ్యక్తం చేసింది. హేమంత్‌ చనిపోయాడనే సమాచారం తెలుసుకున్న గ్రా మస్తులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకుని అమ్మాజీని ఓదా ర్చారు. తన కుమారుడు మృతిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని తల్లి డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు