ప్రతిష్టాత్మకంగా మూర్తిరాజు శత జయంతి వేడుకలు

9 Dec, 2019 12:38 IST|Sakshi
గణపవరంలో శత జయంతి ఏర్పాట్లకు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే వాసుబాబు తదితరులు 

సాక్షి, గణపవరం: మాజీ మంత్రి, విద్యాదాత, గాంధేయవాది దివంగత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సందర్శించారు. కళాశాల ఆవరణను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లపై సమీక్షించారు.

జీవితాంతం గాంధేయవాదాన్ని ఆచరించి, విలువలు కలిగిన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడమే కాక 100కు పైగా విద్యాలయాలు, కళాశాలలను స్థాపించిన ఆదర్శ నాయకుడు మూర్తిరాజు శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమం భావితరాలకు గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తొలుత శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో మూర్తిరాజు నిర్మించిన గాంధీ భవనం వద్ద నిర్వహించాలని భావించారు.

ఈ ప్రాంతాన్ని వారం క్రితం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే వాసుబాబు పరిశీలించారు. అయితే ఈ ప్రదేశంలో భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల ట్రా ఫిక్‌ సమస్య ఉంటుందని కార్యక్రమాన్ని గణపవరం మూర్తి రాజు డిగ్రీ కళాశాలకు మార్చారు. ఇక్కడ మూర్తి రాజు జీవిత విశేషాలతో కూడిన చిత్రాల ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, ఇతర విశేషాలు తెలిపే ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  వైఎస్సార్‌ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, మండల పార్టీ కనీ్వనర్‌ దండు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి నడింపల్లి సోమ రాజు, పట్టణ కనీ్వనర్‌ బత్తి సాయి, నాయకులు తెనాలి సునీల్, తోట శ్రీను, సరిపల్లె చిన్నా, వెజ్జు వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు