ఏపీలో శ్రీదేవి డిజిటల్‌ సేవలు ప్రారంభం

7 Aug, 2019 15:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ సేవలు అందించేందుకు శ్రీదేవి డిజిటల్‌ సిస్టం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం ఆడమ్‌తో సంస్థ చైర్మన్‌ రామకృష్ణంరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఆరు జిల్లాల్లో కేబుల్‌ టీవీతో పాటు హైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌, నెట్‌ సేవలను ఈ సంస్థ అందించనుంది. మార్కెట్‌లో కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా తమ సేవలను అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు.  

మరిన్ని వార్తలు