సిక్కోలు @12 డిగ్రీలు

20 Dec, 2014 03:12 IST|Sakshi
సిక్కోలు @12 డిగ్రీలు

* చలిగాలులతో వణికిపోతున్న ప్రజలు
* ప్రత్యామ్నాయాల వైపు పరుగులు
* అవస్థలు పడుతున్న గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు

శ్రీకాకుళం కల్చరల్: వణికిస్తున్న చలి గాలులు.. ఉదయం , రాత్రి వేళల్లో దట్టంగా కురుస్తున్న మంచు.. భారీగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు.. వెరసి చలి పంజాకు చిక్కి శ్రీకాకుళం జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలో ఈ సీజనులో తొలిసారి శుక్రవారం 12 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. తొమ్మిది గంటలైనా మంచు తెరలను చీల్చుకొని సూరీడు బయటకు రాలేకపోతున్నాడు. అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలలు మొదలవుతున్నాయి.

గత మూడు రోజుల నుంచి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
 ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇళ్లలోనే ఉంటున్నా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు ధరిస్తే తప్ప చలి నుంచి తప్పించుకోలేని పరిస్థితి.  చలి తీవ్రత పెరగడంతో అస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు