శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

27 Oct, 2013 14:52 IST|Sakshi

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగావళి నది వరద పోటెత్తింది, ఈ నేపథ్యంలో ఆ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదివారం తెలిపారు. జిల్లాలో 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 30 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. దాంతో శ్రీకాకుళం పట్టణవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గడిచిన 24 గంటల కాలంలో 300 మి. మీ వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ వివరించారు.
 

మరిన్ని వార్తలు