తడిసి ముద్దయిన శ్రీకాకుళం జిల్లా

13 Oct, 2013 12:26 IST|Sakshi

పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లు కనిష్ఠంగా 10 సెంటీమీటర్లతో మొదలుపెట్టి, గరిష్ఠంగా 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో.. ఇచ్ఛాపురంలో 20 సెంటీమీటర్లు, కవిటిలో 15.4 సెం.మీ, కంచిలి 14.7సెం.మీ, కోటబొమ్మాళి 10.8, సోంపేటలో 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, గార, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, రణస్థలం మండలాల్లో ఈ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.
 

మరిన్ని వార్తలు