గ్రహణం వేళ ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు

26 Dec, 2019 10:01 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: సూర్యగ్రహణం సందర్బంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలోనికి శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచే యథావిధిగా పూజలు కొనసాగాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో పాల్గొంటున్నారు. ఇది శుభ పరిణామం అని పూజారులు అంటున్నారు.

సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారన్నది అందరికీ తెలిసినా...తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తితోపాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలోనే భక్తులు దర్శించుకునే వీలుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు