శ్రీకాళహస్తి ఆలయంలో థర్మల్‌ స్కానింగ్‌ గన్స్‌

12 May, 2020 10:26 IST|Sakshi
భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన సర్కిళ్లు

ప్రభుత్వ ఆదేశాలు వస్తే భక్తులకు స్వామివారి దర్శనం : ఈఓ

చిత్తూరు, శ్రీకాళహస్తి: లాక్‌డౌన్‌ సడలించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రతి భక్తుడూ మాస్కు ధరించేలా అవగాహన కల్పించడమే కాకుండా ఆలయంలో భక్తుల టెంపరేచర్‌ తెలుసుకునేందుకు థర్మల్‌ స్కానింగ్‌ గన్స్‌ ఏర్పాటు చేస్తామని, అలాగే చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజర్‌ స్టాండ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆలయంలో ప్రవేశించే భక్తులను డిస్‌ ఇన్ఫెక్షన్‌ టన్నెల్‌ ద్వారా పంపి పిచికారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాహుకేతు పూజలు చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఒక పీటకు ఒక పూజా టికెట్టు మాత్రమే అనుమతిస్తామన్నారు.

మరిన్ని వార్తలు