‘జలవిద్యుదుత్పత్తి’ కేంద్రానికి పాతికేళ్లు

20 Dec, 2013 04:54 IST|Sakshi

 బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకుని శనివారం 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 1988 డిసెం బర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారాక రామారావు చేతుల మీదుగా  ఈ కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  అప్పటి నుంచి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుదుత్పత్తి.
 
 దీంతో ప్రభుత్వం  కాకతీయ కాలువ ప్రారంభంలో  సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభిం చారు. రెండో దశలో నాల్గవ టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండో టర్బయిన్ 1987 డిసెంబర్‌లో, మూడో  టర్బయిన్ 1988 జూలైలో పను లు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెం బర్‌లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పనులు పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి  కేంద్రంగా  విరాజిల్లుతోంది.
 
 స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో..
 జల విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు.  టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్‌కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వి విధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.  24 గంటలకోసా రి  విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుదుత్పత్తి కేం ద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుదుత్పత్తి జరుగుతుంది.  24 ఏళ్లలో కేవలం నాల్గు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది.  ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్వీర్యమయ్యేలా ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో  కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాల్గు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడ ంలేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకాతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టి  కాలువ కు గండి పడే ప్రమాదం లేక పోలేదు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న  జల విద్యుదుత్పత్తి కేంద్రంపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు