శ్రీవారి ప్రత్యేక దర్శనానికీ ‘ఆధార్’ లింక్!

10 Mar, 2016 01:14 IST|Sakshi
శ్రీవారి ప్రత్యేక దర్శనానికీ ‘ఆధార్’ లింక్!

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేటాయించే రూ.300 ఆన్‌లైన్ టికెట్ల కేటాయింపునకు కూడా ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికులకు ప్రతినెలా మొదటి మంగళవారం ఐదువేల మందికి ప్రత్యేకంగా శ్రీవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. స్థానికులు వరుసగా మూడు నెలలు రాకుండా ఆధార్ నంబరును అనుసంధానం చేసి ఇప్పటికే అమలుచేస్తోంది. అదేవిధంగా ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపుల్లో మరింత పారదర్శకంగా ఉండాలని ఆధార్‌తో అనుసంధానం చేయాలని సంకల్పించిన విషయం విదితమే.

అదే తరహాలో రూ.300 టికెట్లకు కూడా భవిష్యత్తులో ఆధార్ అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పద్ధతిలో రూ.300 టికెట్లను ప్రభుత్వ గుర్తింపు కార్డుల ఆధారంగా టికెట్లు కేటాస్తున్నారు. భవిష్యత్‌లో రూ.300 టికెట్లకూ పోటీ పెరిగితే? ఒకసారి వచ్చిన భక్తుడికి నిర్ణీత సమయం పెట్టి నెలకోసారో, రెండు నెలల కోసారో తిరిగి టికెట్టు ఇచ్చేలా రేషన్ దర్శనం అమలుచేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు