ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌

11 Feb, 2019 14:25 IST|Sakshi

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరగనున్నాయని, హాల్‌ టికెట్లను విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.  నెల రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్ని మంత్రి గంటా వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్ :

  • 18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
  • 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
  • 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
  • 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
  • 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
  • 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
  • 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
  • 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
  • 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
  • 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
  • 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2

మరిన్ని వార్తలు