స్టాఫ్‌నర్సు ఆత్మహత్యాయత్నం

8 Dec, 2013 05:05 IST|Sakshi

మహబూబ్‌నగర్ క్రైం/అడ్డకల్ న్యూస్‌లైన్:  ఓ స్టాఫ్‌నర్సు తాను విధులు నిర్వహిస్తున్న పీహెచ్‌సీలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి  పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అడ్డాకుల మండలం జానంపేట పీహెచ్‌సీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేర కు.. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(పీహెచ్‌సీ)లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న కృష్ణవేణికి శనివారం సాయంత్రం నుంచి  విధులు నిర్వహించాల్సి ఉంది. తనకు సా యంత్రం వ్యక్తిగత పనిఉండటంతో ఉదయం విధులు నిర్వహిం చాల్సిన మరో స్టాఫ్‌నర్సుతో సర్దుబాటు చేసుకుని ఉదయం విధులకు వచ్చింది. దీంతో పీహెచ్‌సీ వైద్యాధికారిణి జరీనాభాను సదరు స్టాఫ్‌నర్సును పిలిచి డ్యూటీలు మార్చుకుంటే తన సమాచారం ఇవ్వాలని, మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే బాగుండదని తిరి గి వెళ్లాలని సూచించింది.

రోస్టర్‌పద్ధతి ప్రకారం సాయంత్రం విధులకే రావాలని హుకుంజారీచేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వైద్యాధికారిణి కృష్ణవేణికి మెమో జారీచేసింది. దీంతో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు పీహెచ్‌సీలోనే ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు సెల్ మెసేజ్ పంపించింది. ఇది గమనించిన తోటిసిబ్బంది ఆమెను వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే కోలుకుంటుంది. వైద్యాధికారిణి కాంట్రాక్టు సిబ్బందిని ఓ విధంగా తనను మరోవిధంగా చూస్తోం దని బాధితురాలు వినిపిస్తోంది.
 వైద్యాధికారిణి ఏమన్నారంటే..
 ‘రోస్టర్ ప్రకారం విధులు నిర్వహించాలని చెప్పడం తప్పైపోయింది. విధులకు సక్రమంగా హాజరుకాకుండా కుటుంబసమస్యలతో ఆమె ఎప్పుడు ఆందోళనగానే ఉండేది. శ నివారం కృష్ణవేణి సాయంత్రం డ్యూటీకి రావాలి. కానీ ఆమె ఉదయం డ్యూటీకి వచ్చింది. సాయంత్రం డ్యూటీకి రావాలని సూచించడంతో గొడవకు దిగింది. ఆస్పత్రిలోని ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగింది. వాస్తవంగా ఆమె నిద్రమాత్రలు మింగిందా? లేదా అనుమానంగా ఉంది..’అని వైద్యాధికారిణి జరీనాభాను పేర్కొంది. గతంలో కూడా ఆమె ఇక్కడపనిచేస్తున్న ఓ వైద్యుడిని బెదిరించేందుకు నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు