ఎంత ఘోరం!

7 Aug, 2018 12:38 IST|Sakshi
సీతాదేవి మృతదేహం వద్ద రోదిస్తున్న సోదరి

రక్తహీనత, హైబీపీతో ప్రసవననాంతరం రాజేంద్రపాలెం స్టాఫ్‌ నర్స్‌ మృతి

కొయ్యూరు (పాడేరు):  రక్తహీనత ఆఖరికి వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళనూ బలిగొంది. ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగం వచ్చింది. గర్భవతి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రామం కొమ్మిక వచ్చింది. ఆదివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తహీనత,  హైబీపీ రూపంలో కొన్ని గంటలకే మృతి చెందింది.  రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్న నేతల సీతాదేవి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రా మం కొమ్మిక వెళ్లింది.

ప్రసవ తేదీ (ఈడీడీ) దగ్గర కావడంతో అక్కడే ఉంది. ఆదివారం ఉదయం కొమ్మికకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కంఠారం ఆరోగ్యకేంద్రంలో ప్రసవం జరిగి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొద్దిసేపటికి ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడ కొద్దిసేపు వైద్యం చేసిన తరువాత వైద్యులు ఇక్కడ సాధ్యం కాదని వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు అప్పటికే ఆమెకు రక్తహీనతకు తోడుగా హైబీపీ  వెంటాడుతుంది. నర్సీపట్నంలో ప్రముఖ గైనకాలజిస్టు సుధాశారదను కూడా సంప్రదించారు. తానేమి చేయలేనని  కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. వెంటనే ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. ఆమెను ఆపరేషన్‌ «థియేటర్‌కు తీసుకెళ్తుండగానే  ఊపిరి ఆగిపోయింది. ఈమె మృతితో కొమ్మక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు